మేడ్చల్,అర్జున్ సమాచారం:
లక్షల మందిని ఆగం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తక్షణమే నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. దరఖాస్తులు లేకుండా ఎట్లైతే నిషేధిత జాబితాలో చేర్చారో అట్లనే తొలగించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేసారు.
మంగళవారం నాడు మల్కాజ్గిరి జిల్లా వాజ్ పేయి నగర్ హనుమాన్ టెంపుల్ గ్రౌండ్ లో జరిగి లో 22A నిషేధిత భూముల బాధితుల సభలో అయన పాల్గోన్నారు.
హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం తప్పు చేస్తే.. ప్రజలకు ఎందుకు శిక్ష? 2008లో యూఎల్సీ రద్దయిన తర్వాత, మళ్లీ ఇప్పుడు ఈ భూములను రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో ఎందుకు పెట్టారు? ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 7,500 జీవోలతో, మేడ్చల్ జిల్లాలో 6,000 జీవోలతో లక్షలాది ఆస్తులను అడ్డగోలుగా నిషేధిత జాబితాలో చేర్చారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు తన చేతిలోకి రావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా అధికారులను ఆదేశించి రాత్రికి రాత్రే ఈ ఆస్తులను బ్లాక్ చేయించారని అన్నారు.
ఈ నిర్ణయంతో లక్షలాది అపార్ట్మెంట్లు, ఇళ్లు, ప్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య ప్రజలను ఆగం చేసింది. దొంగతనం చేసిన దొంగ దొరికిపోయాక.. సారీ చెబితే చేసిన నేరం మాఫీ అయిపోతుందా? తప్పుకు శిక్ష పడాల్నా వద్దా? ఈరోజు నువ్వు చేసిన ఉద్దేశపూర్వక తప్పుకు లక్షల మంది ప్రజలు ఆగమయ్యారు. నిషేధిత జాబితా నుంచి ఆస్తులను తొలగించాలంటే 30 శాతం కమీషన్ అడుగుతున్నారట.. ఇది ముమ్మాటికీ 30 పర్సెంట్ కమీషన్ గవర్నమెంట్.పైగా ఆస్తులను 22A నుంచి తీయాలంటే, ల్యాండ్ డెవలప్మెంట్ కూడా తమకే అప్పజెప్పాలని బ్లాక్ మెయిల్ చేస్తూ కండిషన్లు పెడుతున్నారని అన్నారు.
అసలు నిషేధిత జాబితాలో భూములను పెట్టాలని చెప్పింది ఎవరు? దీనికి బాధ్యులు ఎవరు? తక్షణమే తేల్చాలి. ప్రజల ఈ కష్టానికి కారణమైన మంత్రులు.. అధికారుల పేరు చెప్పి తప్పించుకుంటామంటే మేము చూస్తూ ఊరుకోం. కుక్క తోకను ఆడిస్తదా లేక తోక కుక్కను ఆడిస్తదా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెబితేనే అధికారులు భూములను నిషేధిత జాబితాలో పెట్టారు తప్ప వాళ్లంతట వాళ్లు చేయలేదు.లక్షల మందిని ఆగం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తక్షణమే నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. దరఖాస్తులు లేకుండా ఎట్లైతే నిషేధిత జాబితాలో చేర్చారో అట్లనే తొలగించాలని అన్నారు.
==========================